తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా సిరిమల్లె జయేందర్

జమ్మికుంట: తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు సిరిమల్లె జయేందర్ గురు స్వామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్ర అధ్యక్షులు వాకాటి భాస్కరరావు  జయేందర్ సేవలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించినారు
2026-2028 రెండు సంవత్సరాల కాలానికి గాను రెండవసారి ఉపాధ్యక్ష పదవి వరించడం పట్ల జమ్మికుంట అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అయ్యప్ప దేవాలయంలో స్వామి ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. అయ్యప్ప సమాజం విస్తరింప చేయడానికి మరియు *శబరిమల* వెళ్లే భక్తుల సౌకర్యాల నిమిత్తం కేరళ ప్రభుత్వానికి మరియు శబరిమల దేవస్థానం వారికి పలు సమస్యలపై విన్నవించి కొన్నింటిని పరిష్కరింప  చేయించడంలో ఐక్యవేదిక ముందు నిలిచింది.
ఇకముందు పలు ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరించడానికి కార్యాచరణ రూపొందించినట్లు జయేందర్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు మామిడాల మనోహర్, ఇమ్మడి భాస్కర్, రాజేంద్రప్రసాద్, ప్రతాపరెడ్డి, జగదీశ్వర్, దామోదర్, వెంకట్ రెడ్డి, మురళి, శివ తదితరులు పాల్గొని జయేందర్ స్వామి ని ఘనంగా సన్మానించి అభినందన  లు తెలిపినారు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos