జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అక్కాచెల్లెళ్లతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. పట్టణంలోని 30 వార్డులకు గాను 18 ప్రాంతాల్లో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.











Add a comment