Category: Events

Mar 24
మున్సిపల్ చైర్మన్‌కు ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల ఆహ్వానం

మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Mar 24
మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌కు ఇల్లందకుంట శ్రీ సీతారామ కల్యాణ ఆహ్వానం

మార్చి 24: ఈ నెల 27న జరగనున్న ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంను ఆలయ కమిటీ ఆహ్వానించింది. ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

Feb 22
జమ్మికుంటలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని […]

Nov 21
అంతర్జాతీయ స్వర్ణ పతక విజేత రఘుకు రేపు జమ్మికుంటలో సన్మానం

జమ్మికుంట, నవంబర్ 21: భూటాన్లో జరిగిన అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్ హ్యామర్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుపుల రఘును శనివారం (నవంబర్ 22) ఉదయం 7 గంటలకు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా సన్మానించనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం చెల్పూర్ గ్రామానికి చెందిన రఘు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్రీడాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ […]

Nov 19
విస్డం కళాశాలలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్వయం పరిపాలన దినోత్సవం

జమ్మికుంట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక విస్డం జూనియర్ కళాశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అధ్యాపకులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా రావుల శరణ్య ప్రిన్సిపాల్‌గా, బొడ్డుపల్లి సందీప్ కుమార్ కరస్పాండెంట్ గా, కొత్తూరు సోనీ వైస్ ప్రిన్సిపాల్ గా, కుర్ర సిద్దు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే కళాశాల లక్ష్యమని ప్రిన్సిపాల్ కే విజయేందర్ రెడ్డి తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు […]

Nov 19
జమ్మికుంటలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి […]

Nov 18
WJI జిల్లా ఉపాధ్యక్షుడిగా నర్సిని కేదారి నియామకం

కరీంనగర్: వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కరీంనగర్‌లోని ఓ బాంకెట్ హాల్‌లో జరిగిన WJI సర్వసభ్య సమావేశంలో ఈ నియామకాలు జరిగాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన బీఎంఎస్ (BMS) అనుబంధ సంఘంగా WJI గుర్తింపు పొందింది.ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు నర్సిని కేదారి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషినూతనంగా ఎన్నికైన నర్సిని కేదారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు […]

Nov 17
ఈనెల 19న నిర్వహించే బీసీ సదస్సును విజయవంతం చేయాలి

జమ్మికుంట: బీసీల హక్కులు, రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కు అనే నినాదంతో ఈనెల 19న (బుధవారం) ఇందిరా నగర్‌లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సును రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల బీసీలు హాజరై విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శనిగరపు తిరుపతయ్య కోరారు.సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు […]

Nov 15
బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 19న జమ్మికుంటలో కీలక సదస్సు

జమ్మికుంట: మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ‘బీసీల హక్కులు బీసీలకు దక్కాలి’ అనే నినాదంతో ఈ నెల 19న (బుధవారం) దినేష్ కన్వెన్షన్, జమ్మికుంటలో చైతన్య సదస్సు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ హక్కులను సాధించుకోవడంపై బీసీ సమాజం సంఘటితం కావాలని సదస్సు కోరింది.విద్య, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై […]

Nov 14
దేశ నిర్మాణంలో నెహ్రూ కృషి కీలకం: ఇల్లందకుంటలో ఘనంగా జయంతి
నవంబర్

ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి.నాయకులు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం, పురోభివృద్ధిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు, రచయిత మరియు రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగానే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నెహ్రూ ఆశయాల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ […]

Listings News Offers Jobs Contact