Category: Devotional

Oct 17
నిత్య అన్నదానానికి పాడి ఉదయ్ నందన్ రెడ్డి రూ.51,116 విరాళం

జమ్మికుంట: పట్టణంలోని పద్మశాలి వీధిలో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ సత్కార్యానికి YuppTV, Turito అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి రూ.51,116 విరాళం అందించారు. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుభాష్ యూత్ ప్రతినిధులు, కమిటీ సభ్యులు, పాడి ఉదయ్ నందన్ రెడ్డి బృందం పాల్గొన్నారు.

Oct 14
భద్రకాళి ఆలయ కమిటీ సభ్యుడిగా పేరాల శ్రీనివాసరావు

కరీంనగర్ జిల్లా | జమ్మికుంట: హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యుడిగా జమ్మికుంటకు చెందిన పేరాల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. శ్రీనివాసరావుకు కీలక బాధ్యత లభించడంతో జమ్మికుంటలో హర్షం వ్యక్తమవుతోంది.

Sep 24
TTD అక్టోబర్ హోమం టికెట్లు రేపు విడుదల

24 సెప్టెంబర్, 2026: అక్టోబర్‌ 2026 నెలకు సంబంధించిన హోమం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబర్‌ 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉండనున్నందున భక్తులు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Sep 23
జమ్మికుంటలో గణేష్ నిమజ్జనం ప్రారంభం

జమ్మికుంట పట్టణ పరిధిలో నవరాత్రులు పూజలందుకున్న తొలి గణేష్ విగ్రహం నిమజ్జన కార్యక్రమం నాయిని చెరువు వద్ద ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నిమజ్జనాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు ప్రారంభమైనందున భక్తులు సకాలంలో చేరుకుని నిమజ్జనం పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, RDO, కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, MRO, CI, SI, అధికారులు పాల్గొన్నారు.

Sep 20
వినాయక మండపాల్లో పాడి ఉదయ్ నందన్ రెడ్డి సందడి

వీణవంక, సెప్టెంబర్ 20: వీణవంక మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. YuppTV, Turito ఫౌండర్ & CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి మండలంలోని 10 వినాయక మండపాలతో పాటు పలు గ్రామాల్లోని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాల నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో యువత చొరవను ఉదయ్ నందన్ రెడ్డి అభినందించారు.

Sep 20
జమ్మికుంటలో ఘనంగా మహా అన్నదాన ప్రసాద వితరణ

జమ్మికుంట బస్టాండ్ సమీపంలో శ్రీ వరసిద్ధి వినాయక మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండలి ప్రతినిధులు గర్రెపల్లి అరుణాదేవి, గుండా కావ్య, గౌరిశెట్టి సుజాత, యాంసాని జ్యోతిరాణి, చందా గిరిజ, మద్ది వైష్ణవి, కే. శ్రీదేవి, ప్రణీత, రాజేశ్వరి, మహాలక్ష్మి, చొక్కారపు […]

Mar 24
మున్సిపల్ చైర్మన్‌కు ఇల్లందకుంట బ్రహ్మోత్సవాల ఆహ్వానం

మార్చి 24: ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌ను ఆలయ చైర్మన్ ఇంగ్లే రామారావు, ధర్మకర్తలు ఆహ్వానించారు. ఆయనకు ఆహ్వాన పత్రికతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మున్సిపాలిటీ తరపున పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తామని, రాజకీయాలకు అతీతంగా పాలకవర్గం అన్నివిధాలా సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ తదితరులు పాల్గొన్నారు.

Feb 22
తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా సిరిమల్లె జయేందర్

జమ్మికుంట: తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు సిరిమల్లె జయేందర్ గురు స్వామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వాకాటి భాస్కరరావు  జయేందర్ సేవలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించినారు 2026-2028 రెండు సంవత్సరాల కాలానికి గాను రెండవసారి ఉపాధ్యక్ష పదవి వరించడం పట్ల జమ్మికుంట అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అయ్యప్ప దేవాలయంలో స్వామి ఎదుట ప్రమాణ స్వీకారం […]

Nov 23
ఫిబ్రవరి 2026 కోటా మరియు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల వివరాలు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2026 ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, గదుల కోటా మరియు వైకుంఠ ద్వార దర్శన వివరాలను టీటీడీ విడుదల చేస్తోంది. ఈ నవంబర్ నెలలో మిగిలిన ముఖ్యమైన విడుదల తేదీల పట్టిక కింద ఇవ్వబడింది. గమనిక: వైకుంఠ ద్వార దర్శనం (డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు) కోసం రిజిస్ట్రేషన్ నవంబర్ 27న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 2న లక్కీ డిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు.

Nov 15
అయ్యప్ప ఆలయంలో ఉత్తరా నక్షత్ర పూజ, దీక్ష స్వీకరణ

జమ్మికుంట: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్తరా నక్షత్ర లక్ష్మీ గణపతి హోమం తో పాటు, స్వామివారికి నవవిధ అభిషేకములు, రుద్రాభిషేకం జరిగాయి.అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి, అఖండ హారతి ఇచ్చారు. ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. వారికి బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ మాల మంత్రాలతో దీక్షను […]

Listings News Offers Jobs Videos