జమ్మికుంట బస్టాండ్ సమీపంలో శ్రీ వరసిద్ధి వినాయక మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండలి ప్రతినిధులు గర్రెపల్లి అరుణాదేవి, గుండా కావ్య, గౌరిశెట్టి సుజాత, యాంసాని జ్యోతిరాణి, చందా గిరిజ, మద్ది వైష్ణవి, కే. శ్రీదేవి, ప్రణీత, రాజేశ్వరి, మహాలక్ష్మి, చొక్కారపు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.











Add a comment