జమ్మికుంట: అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంటలో గోడ పోస్టర్ ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, పీఆర్సీ, డీఏ అమలు చేయాలని, కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.











Add a comment