జమ్మికుంటలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం

జమ్మికుంట తహసీల్దార్ గడ్డం సుధాకర్ ఆదేశాల మేరకు గిర్థవర్ గడ్డం శంకర్ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్ డేలో భాగంగా BLOలు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాలో తప్పులు ఉంటే ఫారం-7, ఫారం-8 ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత BLOలు పాల్గొన్నారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos