కేశవపురం: జమ్మికుంట మండలం కేశవపురంలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో 5 రోజులుగా నిర్వహించిన ప్రాంత స్థాయి ఘోష్ వర్గ ఘనంగా ముగిసింది. ప్రారంభోత్సవంలో తక్కెళ్లపల్లి తిరుపతిరావు, సమారోప్‌లో అఖిల భారతీయ సంఘటన మంత్రి శ్రీరామ్ ఆరావర్‌కర్ పాల్గొన్నారు. 243 మంది విద్యార్థులు, 59 మంది ఆచార్యులు శిక్షణలో పాల్గొన్నారు. ఘోష్ శిక్షణతో క్రమశిక్షణ, ఏకాగ్రత, సమన్వయం, దేశభక్తి పెంపొందుతాయని వక్తలు తెలిపారు.
జమ్మికుంట మండలంలోని 9 గ్రామాల్లో రూ.8 లక్షల విలువైన 17 సీఎంఆర్ఎఫ్ చెక్కులను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
జమ్మికుంట తహసీల్దార్ గడ్డం సుధాకర్ ఆదేశాల మేరకు గిర్థవర్ గడ్డం శంకర్ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్ డేలో భాగంగా BLOలు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాలో తప్పులు ఉంటే ఫారం-7, ఫారం-8 ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత BLOలు […]