Day: October 24, 2026

Oct 24
ఇందిరాపార్క్ ధర్నాను జయప్రదం చేయాలి

జమ్మికుంట: అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జమ్మికుంటలో గోడ పోస్టర్ ఆవిష్కరించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, పీఆర్సీ, డీఏ అమలు చేయాలని, కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Oct 24
THE TREE HOUSE – Cafe Bistroలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు

జమ్మికుంట: ఇందిరానగర్‌లో త్వరలో ప్రారంభం కానున్న THE TREE HOUSE – Cafe Bistroలో మహిళా ఉద్యోగుల నియామకానికి అవకాశాలు ఉన్నాయి. Receptionist cum Billing, Welcoming Girls, Kids Activity Coordinator (ఆదివారం మాత్రమే) తదితర పోస్టులకు అభ్యర్థులు కావాలి. ఉద్యోగులకు నిర్దేశిత డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఆసక్తి ఉన్న వారు 7331115042, 9493263879 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Listings News Offers Jobs Videos