Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
జమ్మికుంట, సెప్టెంబర్ 28: మోత్కులగూడెంకు చెందిన బలభద్ర రామారావు అనారోగ్య సమస్యలతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న 9వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము వెంటనే స్పందించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ, కాటన్ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, వైస్‌చైర్మన్ ఎర్రం సతీష్‌రెడ్డి, […]
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25, శుక్రవారం కొత్త పత్తి మార్కెట్‌కు 8 క్వింటాళ్ల అరైవల్స్ వచ్చాయి. ఒక వాహనం ద్వారా వచ్చిన పత్తికి క్వింటాల్‌కు రూ.7,551 ధర నమోదైంది. పత్తి బ్యాగుల అరైవల్స్ నిల్‌గా ఉన్నాయి. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మార్కెట్‌కు సెలవు. సెప్టెంబర్ 28, సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుంది.
జమ్మికుంట పట్టణ పరిధిలో నవరాత్రులు పూజలందుకున్న తొలి గణేష్ విగ్రహం నిమజ్జన కార్యక్రమం నాయిని చెరువు వద్ద ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నిమజ్జనాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు ప్రారంభమైనందున భక్తులు సకాలంలో చేరుకుని నిమజ్జనం పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, RDO, కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, MRO, CI, SI, అధికారులు పాల్గొన్నారు.
జమ్మికుంట: పట్టణంలో బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నాయిని చెరువు వద్ద పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్ చందా రాజు, ఏఈ వికాస్, […]
హైదరాబాద్: తెలంగాణలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బంజారాహిల్స్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సంక్షేమ బోర్డుల విధి విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం గుంటి సామ్రాజ్యం, అన్నేడి వెంకట్ రెడ్డి, ఎస్.వి. శివకుమార్, కన్నెగంటి రవి, ఎస్.కే. సల్లావుద్దీన్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, […]
జమ్మికుంటలోని పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సందర్శించారు. భవనం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ కళాశాలను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నందున, భవనాన్ని వెంటనే హాస్టల్‌గా వినియోగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో SFD కో-కన్వీనర్ గోస్కుల అజయ్, జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కొత్త పత్తి కొనుగోళ్లకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం మంగళవారం ముహూర్తం చేశారు. రైతులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. బహిరంగ వేలంలో పత్తికి గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.7,272, కనిష్ఠంగా రూ.7,011 ధర పలికింది. మురళీకృష్ణ, మల్లికార్జున ట్రేడర్స్ పత్తిని కొనుగోలు చేశారు. రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకువచ్చి మంచి ధరలు పొందాలని చైర్‌పర్సన్ సూచించారు.
జమ్మికుంట, 21 సెప్టెంబర్, 2026: మండల పరిషత్ సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్ లింగారెడ్డి అధ్యక్షతన మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో 17 మంది సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ పద్మావతి, ఎంఆర్ఓ సుధాకర్ పాల్గొన్నారు. ఆయా శాఖల పనులపై సమీక్ష నిర్వహించగా, సర్పంచులు మందుల కొరత, వైద్య సిబ్బంది కొరత, ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని లింగారెడ్డి […]
ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వర్కుటి మదన్ రావు అనారోగ్యంతో సెప్టెంబర్ 20న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందారు. ఆర్మీ, రైల్వే శాఖల్లో సేవలందించిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మదన్ రావు మృతికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోలుగూరి సదయ్య సంతాపం తెలిపారు. మదన్ రావు భౌతికదేహంపై కాంగ్రెస్ కండువా వేసి నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.