చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహణ

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ, కాటన్ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, వైస్‌చైర్మన్ ఎర్రం సతీష్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు, మార్కెట్ సిబ్బంది, వ్యాపారులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos