Day: September 26, 2026

Sep 26
తప్పుడు ప్రచారాలపై ఇమ్రాన్ ఆగ్రహం

జమ్మికుంట, 26 సెప్టెంబర్ 2026: తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ ఆరోపించారు. అసత్య పోస్టులతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి అండగా ఉండటం, పార్టీ నాయకులను కలవడాన్ని కొందరు వివాదాస్పదంగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రచారం కొనసాగితే చట్టపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.

Sep 26
చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహణ

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ, కాటన్ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, వైస్‌చైర్మన్ ఎర్రం సతీష్‌రెడ్డి, […]

Listings News Offers Jobs Videos