Category: Flash News

Oct 06
ప్రథమ వర్ధంతికి హాజరైన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట పట్టణంలో దిడ్డి సుధాకర్ సతీమణి శ్రీదేవి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ హాజరై శ్రీదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో దిడ్డి రాము, పొరండ్ల శ్రావణ్, గడ్డం దీక్షిత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Oct 06
హైమాస్ట్ లైట్ కోసం భూమిపూజ

జమ్మికుంట ఆబాది 14వ వార్డులో ప్రజల సౌకర్యార్థం హైమాస్ట్ లైట్ ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మైస శిరీష రవి, మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, జక్కే రవీందర్, పొడేటి అనిల్, పంజాల అనిల్, తదితరులు పాల్గొన్నారు.

Sep 28
మానవత్వానికి మరో నిదర్శనం

జమ్మికుంట, సెప్టెంబర్ 28: మోత్కులగూడెంకు చెందిన బలభద్ర రామారావు అనారోగ్య సమస్యలతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న 9వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము వెంటనే స్పందించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.

Sep 22
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట: పట్టణంలో బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నాయిని చెరువు వద్ద పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్ చందా రాజు, ఏఈ వికాస్, […]

Sep 22
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు

హైదరాబాద్: తెలంగాణలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బంజారాహిల్స్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సంక్షేమ బోర్డుల విధి విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం గుంటి సామ్రాజ్యం, అన్నేడి వెంకట్ రెడ్డి, ఎస్.వి. శివకుమార్, కన్నెగంటి రవి, ఎస్.కే. సల్లావుద్దీన్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, […]

Sep 21
మండల సమీక్షా సమావేశం

జమ్మికుంట, 21 సెప్టెంబర్, 2026: మండల పరిషత్ సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్ లింగారెడ్డి అధ్యక్షతన మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో 17 మంది సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ పద్మావతి, ఎంఆర్ఓ సుధాకర్ పాల్గొన్నారు. ఆయా శాఖల పనులపై సమీక్ష నిర్వహించగా, సర్పంచులు మందుల కొరత, వైద్య సిబ్బంది కొరత, ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని లింగారెడ్డి […]

Sep 21
మదన్ రావు మృతి పట్ల మోలుగూరి సదయ్య సంతాపం

ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వర్కుటి మదన్ రావు అనారోగ్యంతో సెప్టెంబర్ 20న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందారు. ఆర్మీ, రైల్వే శాఖల్లో సేవలందించిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మదన్ రావు మృతికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోలుగూరి సదయ్య సంతాపం తెలిపారు. మదన్ రావు భౌతికదేహంపై కాంగ్రెస్ కండువా వేసి నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sep 20
IHRC కరీంనగర్  జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్

జమ్మికుంట, సెప్టెంబర్ 20: ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ నియమితులయ్యారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ఆర్టీఐపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని రాజేష్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి, తెలంగాణ అధ్యక్షులు బతుల శంకర్, రాష్ట్ర ఇంచార్జ్ కొంగంటి రాజ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానన్నారు. ఆయనకు సంస్థ ప్రతినిధులు అభినందనలు […]

Oct 04
దుర్గామాతను దర్శించుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్

వావిలాల గ్రామంలో తల్లి దుర్గామాతను దర్శించుకున్న జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం. వేలంపాటలో గెలుపొందిన భక్తులకు వస్త్రాలు అందించారు. తదనంతరం దుర్గామాత కమిటీ సభ్యులు చైర్ పర్సన్ కు అమ్మవారి శాలువ కప్పి ఆశీర్వదించారు. ఈ అవకాశం కల్పించిన దుర్గామాత కమిటీ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Feb 06
అధైర్య పడకండి అండగా ఉంటా – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

అధైర్య పడకండి అండగా ఉంటా లబ్ధిదారులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి – హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బందు రెండో విడత రాలేదని ఎవరూ అధైర్యపడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని, దళితులందరికీ అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం దళిత బంధు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బంద్ పథకాన్ని తెలంగాణ తొలి […]

Listings News Offers Jobs Videos