Tag: jammikunta

Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.

Nov 17
కార్మికుల సమస్యలపై CITU సమరశంఖం: జమ్మికుంటలో ధర్నా!

జమ్మికుంట: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతుల రద్దుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట CITU మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం జమ్మికుంట పట్టణంలో ప్రత్యేక అడ్డా స్థలం కేటాయించాలని, అక్కడ మంచినీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ బోర్డు […]

Nov 15
పీజి స్పాట్ అడ్మీషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ & పీజి కళాశాల, జమ్మికుంటలో ఖాళీగా ఉన్న M.Sc. జువాలజీ మరియు M.Sc. బోటనీ కోర్సుల్లో ప్రవేశం కోసం స్పాట్ అడ్మీషన్లు నిర్వహించనున్నారు.ఈ నెల 18వ తేదీ మంగళవారం ఉదయం 10:00 గంటలకు కళాశాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తుదారులు CPGET – 2025లో అర్హత పొంది ఉండాలి లేదా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోర్సు ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి […]

Nov 15
పదవ, ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

జమ్మికుంట: హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ శనివారం జమ్మికుంట మండలంలోని 8 జిల్లా పరిషత్ హైస్కూళ్లు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను పంపిణీ చేసింది.ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న 227 మందికి, ఇంటర్మీడియట్ చదువుతున్న 160 మందికి కలిపి మొత్తం 387 పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ చేతుల మీదుగా జరిగింది. ఈ […]

Nov 15
బీసీ రిజర్వేషన్లపై నవంబర్ 19న జమ్మికుంటలో కీలక సదస్సు

జమ్మికుంట: మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో ‘బీసీల హక్కులు బీసీలకు దక్కాలి’ అనే నినాదంతో ఈ నెల 19న (బుధవారం) దినేష్ కన్వెన్షన్, జమ్మికుంటలో చైతన్య సదస్సు జరగనుంది. కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ హక్కులను సాధించుకోవడంపై బీసీ సమాజం సంఘటితం కావాలని సదస్సు కోరింది.విద్య, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలోనూ అమలు చేయాలని హెచ్‌ఆర్‌ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై […]

Nov 14
బీహార్‌లో బీజేపీ గెలుపుతో జమ్మికుంటలో సంబరాలు

జమ్మికుంట: బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి 243 స్థానాలకు గాను సుమారు 206 సీట్లలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం అనంతరం కొలకాని రాజు మాట్లాడుతూ, దొంగ ఓట్లంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని బీహార్ ప్రజలు ఓటుతో తిరస్కరించడం చెంపపెట్టు అని ఎద్దేవా […]

Nov 14
జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట — బాలలదినోత్సవం,
స్వయం పాలనా దినోత్సవ కార్యక్రమం

జమ్మికుంట: జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులు చిన్న ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో పాఠాలు బోధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అలరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మండల విద్యా అధికారి హేమలత గారు  ఉపాధ్యాయులుగా […]

Nov 13
🎒 పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

జమ్మికుంట, నవంబర్ 13, 2025: చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని PSK ఫౌండేషన్ వ్యవస్థాపకులు పొనగంటి సాత్విక్ పటేల్ పిలుపునిచ్చారు. పొనగంటి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం మండల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట టౌన్ ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు […]

Nov 13
జమ్మికుంటలో అనధికార క్లినిక్ సీజ్

జమ్మికుంట: పట్టణంలోని ‘సెరా లైఫ్’ క్లినిక్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, డాక్టర్ చందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు గుర్తించి, వెంటనే మూసివేయాలని ఆదేశించారు. చట్టపరమైన రిజిస్ట్రేషన్ వచ్చేవరకు క్లినిక్ తెరవకూడదని నిర్వాహకుడికి సూచించారు. ప్రజలు అర్హత గల వైద్యుల వద్దే వైద్యం చేయించుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ తనిఖీలో సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ రాజు, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.

Nov 13
నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి నాయకులు

వీణవంక మాజీ సింగిల్ విండో చైర్మన్ పెద్ది మల్లారెడ్డి కుమార్తె డా. సుప్రియ – డా. ఆదిత్య కిషోర్ వివాహం బుధవారం కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో జరిగింది. అలాగే, జమ్మికుంట మడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు పెరవేన రమేశ్ కుమారుడు అఖిల్ – దివ్యల వివాహం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్‌లో జరిగింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు […]

Nov 13
జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరల వివరాలు

జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో గురువారం  (13-11-2025) పత్తి అమ్మకాలు కొనసాగాయి. * విడి పత్తి: 66 వాహనాల్లో 593 క్వింటాళ్ల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ధర క్వింటాల్‌కు ₹7,000 నుండి ₹6,200 మధ్య పలికింది. * కాటన్ బ్యాగ్‌లు: 7 మంది రైతులు తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల ధర ₹6,200 నుండి ₹5,000 మధ్య నమోదైంది.

Listings News Offers Jobs Contact