జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా రేపు (25-10-2025) శనివారం ఉదయం 7 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో సకాలంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరనీ అయ్యప్ప సేవా సమితి, జమ్మికుంట వారు ఒక ప్రకటనలో తెలిపారు.
జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీలో 24-10-2025, శుక్రవారం నాడు పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి.విడి పత్తి 1200 క్వింటాళ్ల రాగా, ధరలు క్వింటాలుకు ₹7,200 నుండి ₹6,100 వరకు పలికాయి. కాటన్ బ్యాగ్స్ 27 క్వింటాళ్లకు ₹6,600 నుండి ₹5,500 వరకు ధర లభించింది.మార్కెట్‌కు 25, 26 తేదీలలో (శని, ఆదివారం) సెలవు ప్రకటించారు. మార్కెట్ తిరిగి 27-10-2025, సోమవారం నాడు ప్రారంభమవుతుంది.
జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవతెలంగాణ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను సన్మానించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ వర్క్‌షాప్ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిజిఎం ప్రభాకర్, నవతెలంగాణ ఎడిటర్ రమేష్ చేతుల మీదుగా ఆయన సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు, మిత్రులు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మికుంట: తెలంగాణ ప్రభుత్వం దూదేకుల, నూర్ భాష మరియు ఫకీర్ కులాలకు మొపేడ్ వాహనాలు (ఎలక్ట్రిక్ టూ వీలర్లు), వితంతు/ఒంటరి మహిళలకు రూ.50,000/- అందించే పథకాలను ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేసింది. ఈ పథకాలకు చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. ఎన్నికలు వాయిదా పడినందున, దరఖాస్తు గడువును తిరిగి పొడిగించాలని మైనారిటీ సీనియర్ నాయకులు ఎం.డి గౌసోద్దీన్, ఎం.డి అంకూషా, యాకుబ్, సలీం తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకాలు పేద మైనారిటీల జీవనోపాధికి కీలకం.
హైదరాబాద్/ జమ్మికుంట: ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా రక్షణ చట్టాలు కల్పించాలని బీసీ ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనకై బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. స్థానిక సంస్థల్లో ఉపవర్గీకరణతో రిజర్వేషన్, బడ్జెట్ల తక్షణ విడుదల, నామినేటెడ్ పదవుల్లో దామాషా ప్రకారం నియామకం చేయాలని […]
జమ్మికుంట: అక్టోబరు 13, 2025 న విలాసాగర్ గ్రామానికి చెందిన ఐలవేణి రమేష్ (తండ్రి: సాయిలు) జమ్మికుంటలో పోగొట్టుకున్న ఒప్పో మొబైల్‌ను పోలీసులు తిరిగి అందించారు.టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో, మొబైల్‌ను ఐఎంఈఐ నంబర్ ద్వారా సీఈఐఆర్ పోర్టల్ (CEIR PORTAL) సహాయంతో గుర్తించారు. మొబైల్ పోగొట్టుకున్నవారు వెంటనే ఈ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఇన్స్పెక్టర్ రామకృష్ణ సూచించారు.
జమ్మికుంట: పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, అక్టోబరు 23, 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్ సిబ్బంది అంతా ఈ ర్యాలీలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
జమ్మికుంట: బిజిగిరి షరీఫ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 పదవ తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా తమకు సేవలు అందించిన గురువులు రాజిరెడ్డి, లక్ష్మీపతి, నాగభూషణాచారి, చంద్రమోహన్, రావుల రాజేశంతో పాటు విద్యాభిమాని డాక్టర్ జగదీశ్వర్ను పూర్వవిద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రవి, సమ్మయ్య, సంపత్, రంగు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరానగర్: హుజురాబాద్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దుబాసి సౌజన్య, సురేష్ దంపతులు తమ ఆనందాన్ని పంచుకుంటూ, సాయి ఆశ్రమానికి రూ. 10,000 విలువైన సౌండ్ బాక్స్ సిస్టమ్‌ను బహూకరించారు. సింగరేణి సంస్థలో సౌజన్యకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా, దుబాసి మహేందర్, స్వరూప సలహా మేరకు ఆశ్రమంలో సౌండ్ బాక్స్ అవసరం తెలుసుకొని దీనిని అందించినట్లు సౌజన్య తెలిపారు.ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు మాట్లాడుతూ, దాతలకు, సహకరించిన మహేందర్, స్వరూపలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందిరానగర్ మాజీ […]
జమ్మికుంట: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట వ్యవసాయ కాటన్ మార్కెట్ యార్డ్ (ఏఎంసీ)లో కరీంనగర్ జిల్లా సహకార మార్కెట్ సొసైటీ (డీసీఎంఎస్) ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.జమ్మికుంట ఏఎంసీ చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, గ్రేడ్ వన్ సెక్రటరీ ఆర్. మల్లేశం, గ్రేడ్ టు రాజ మరియు సిబ్బంది, సెంటర్ ఇంచార్జీ ఎగిత అశోక్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పుల్లూరు […]