జమ్మికుంటలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని ఉదృతపరిచి నాడు స్వాతంత్ర తర్వాత భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశం ఈరోజు ఇంత అభివృద్ధిలో ఉందంటే నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వేసిన బీజమే అని గర్వంగా చెప్పుకోవచ్చు అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం, యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాతకాల రమేష్, NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి అజ్మత్, స్టార్ రఫీ, అయ్యుబ్, పాషా, సల్లు బాబా, ఆశ్రఫ్, హాజీ, రషీద్, జావీద్, అహ్మద్, ఫాకురుద్దీన్, గఫ్ఫార్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos