ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడికి ఘన సన్మానం

జమ్మికుంట, జూలై 1: జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన లెంకలపల్లి శరత్ కుమార్‌కు స్థానిక గాండ్ల కుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. గాండ్ల కుల సంఘం తరపున నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శరత్ కుమార్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో గాండ్ల కుల గౌరవ అధ్యక్షుడు వెన్నంపల్లి విఠల్ దాస్, మండల అధ్యక్షుడు పోతునూరి శ్రీశైలం పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు శరత్ కుమార్ ఆర్యవైశ్య సంఘం బలోపేతానికి, ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాండ్ల కులస్తులు పిల్లలమర్రి రవి, సంద శ్రీనివాస్, వెన్నంపల్లి పవన్ కుమార్, వెన్నంపల్లి సురేందర్ తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact