జమ్మికుంట మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు, స్వర్గీయ పోల్నెని రవీందర్ రావు గారి వర్ధంతి సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.
రామమందిర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనను పార్టీకి రాజీనామా చేయాలంటూ 1997 జూన్ 15న నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు.
వారి ప్రాణ త్యాగాల పునాదులపైనే నేడు బీజేపీ అధికారంలో ఉందని కౌన్సిలర్ శీలం శ్రీనివాస్ తదితరులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.








