బాలికలకు రక్షాకవచం: జమ్మికుంటలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం

మార్చి 8, 2026: జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో డిస్ట్రిక్ట్ ఇమ్మనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సాజిదా అతారి, సూపరిండెంట్ డాక్టర్ బి రమేష్ తో కలిసి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ, యోని, గొంతు క్యాన్సర్లు, జననేంద్రియ మొటిమల నుంచి రక్షణ కల్పించే ప్రాథమిక నివారణ మందే ఈ వ్యాక్సిన్ అని వారు వివరించారు. ఇది 100% సురక్షితమని పేర్కొంటూ, వ్యాక్సిన్ వేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.

img 20260308 wa00348952083689426783844
వ్యాక్సిన్ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంటున్న బాలికలు

రానున్న మూడు నెలల పాటు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆసుపత్రిలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. 14 ఏళ్లు నిండి, 15 ఏళ్లలోపు ఉన్న బాలికలు తమ ఆధార్ కార్డును వెంట తెచ్చుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వరుణ, ఫాతిమా, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ, మరియు ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos