జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జమ్మికుంట (20 జూలై 2026): స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న 4 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

కళాశాలలో తెలుగు-1, కామర్స్-1, డైరీ సైన్స్-1, క్రాప్ ప్రొడక్షన్-1 చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కమీషనర్ ప్రొసీడింగ్స్ నిబంధనల ప్రకారం.. సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55 శాతం మార్కులు సాధించిన వారు ఇందుకు అర్హులు. నెట్ (NET), సెట్ (SET), పీహెచ్డీ (PhD) అర్హతలతో పాటు బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు నియామకంలో ప్రత్యేక వెయిటేజీ ఉంటుందని స్పష్టం చేశారు.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూలై 22 (బుధవారం) ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ విద్యా సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ సూచించారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos