తెలంగాణలో 2026 SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో Special Intensive Revision (SIR) – 2026 ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు ముసాయిదా జాబితాలో ఉన్నాయా లేదా అన్నది ఆన్‌లైన్‌లో సులభంగా పరిశీలించుకోవచ్చు.

ఓటర్లు తమ పేరు, ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం వంటి వివరాలను చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

ఓటర్లు ఇలా చెక్ చేసుకోవచ్చు

ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోని Special Intensive Revision (SIR) – 2026 draft విభాగంలోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసి, సంబంధిత నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించవచ్చు.

మీరు డైరెక్ట్ గా క్రింది లింకు ఓపెన్ చేసి మీ జిల్లా, నియోజక వర్గం, పోలింగ్ బూత్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు

https://voters.eci.gov.in/download-eroll?stateCode=S29

ఓటర్ల జాబితాలో తమ పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి అవసరమైన చేర్పులు, మార్పులు లేదా అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రతి ఓటరూ తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఒకసారి తప్పనిసరిగా పరిశీలించుకోవడం మంచిది.

4 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos