జమ్మికుంట: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జమ్మికుంట పట్టణానికి చెందిన హన్సి గ్రాండ్ మాస్టర్, ఇండియా లెజెండరీ కరాటే ఛాంపియన్ డాక్టర్ సుంకరి యాదయ్యను ఘనంగా సన్మానించారు.
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. కరాటే రంగంలో ఆయన అందిస్తున్న సేవలు, సాధించిన విజయాలను గుర్తిస్తూ ఈ సన్మానం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డా. సుంకరి యాదయ్య మాట్లాడుతూ తనను సన్మానించిన మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ వైపు దృష్టి సారించి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








