ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జమ్మికుంట, ఆగస్టు 13: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు జన్మదినం సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి నివాసం వద్ద బొంగోని వీరన్న, మర్రి రామ్‌రెడ్డి, పంజాల అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణవ్ బాబు ముందుకు సాగుతున్నారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందుతూ ఈ ప్రాంతానికి ఆశాకిరణంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేయడం ప్రణవ్ బాబుకు మాత్రమే సాధ్యమని అన్నారు.

తాత రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయనకు తగ్గ మనవడిగా ప్రణవ్ బాబు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని దేశిని కోటి అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఆయనకు లభించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రణవ్ బాబు ఆగస్టు 15న జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు బొడిగె శ్రీకాంత్, ఎండి సజ్జు తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రం సతీష్‌రెడ్డి, పెద్ది కుమార్, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు చందా రాజు, కుదాడి తిరుపతి, మాచర్ల రాజు, ఒగ్గు రమేష్, ఎగిత సుజాత, అశోక్, పాతకాల మౌనిక, అనిల్, యాట్ల సునీత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే మహిళా కాంగ్రెస్ నాయకులు తోట స్వప్న, పిడుగు భాగ్యలక్ష్మి, మాజీ కౌన్సిలర్ శ్రీహరి, వార్డు అధ్యక్షులు టెంకురాల కిషోర్, ఆడెపు దేవరాజ్, రాజేష్, రాజకుమార్, ఏఎంసీ డైరెక్టర్ సూర్య, రాజేశ్వరరావు, తిరుపతిరెడ్డి, దేవస్థాన డైరెక్టర్ చిరంజీవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos