కాంగ్రెస్ హామీల విస్మరణ… ఉద్యమకారుల అక్రమ అరెస్టు దారుణం!

జమ్మికుంట, మార్చి 24, 2026: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, రూ. 25,000 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.
వీటి సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే, రాత్రికి రాత్రే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. నాడు ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో, నేడు వారిని అణిచివేయడం విచారకరం అని తెలిపారు. వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మరో భారీ ఉద్యమం తప్పదని నరేష్ హెచ్చరించారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos