జమ్మికుంట, మార్చి 24, 2026: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌వీ టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, రూ. 25,000 పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.వీటి సాధన కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే, రాత్రికి రాత్రే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. నాడు ఉద్యమకారులు ప్రాణాలకు తెగించి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో, […]