ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, త్యాగం ద్వారా స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన గాంధీజీ ఆశయాలను నాయకులు కొనియాడారు. సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల్ మార్ట్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యాలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను అందించి ప్రజల ఆదరణ పొందాలని నిర్వాహకులకు సూచించారు. పట్టణ అభివృద్ధికి వ్యాపార వర్గాల సహకారం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ రావు, నూతాల శ్రీనివాస్, రవీందర్ రావు, సత్యం […]
జమ్మికుంట: కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాటన్ జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జమ్మికుంటకు చెందిన బచ్చు భాస్కర్‌ను శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డింగరి హరికృష్ణ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరికృష్ణ ఆచార్యులు, విశ్రాంత ఏఈ కేదారేశ్వర్, పి.సమ్మారావు, వెంకటేశ్వర్లు, సుంకర యాదయ్య, సమ్మయ్య తదితరులు భాస్కర్‌ను సత్కరించారు.
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్న సురక్ష మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. రమేష్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కే. తిరుపతిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు పోషకాహారం అందించడం వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి ఎంతో దోహదపడుతుందని ప్రిన్సిపల్, డాక్టర్ తిరుపతి పేర్కొన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణ పరిధిలో పోగొట్టుకున్న ఐదు మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి రికవరీ చేశారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో CEIR ఆపరేటర్ కానిస్టేబుల్ సౌమ్య ఫోన్లను గుర్తించారు. సోమవారం వాటిని యజమానులు కొమ్ము ప్రేమ్ కుమార్, ఎండీ రియాజుద్దీన్, గాదె రాములు, ఎండీ సాదిక్, యాద వెంకటాచలంకు అప్పగించారు. ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మికుంట: కొత్తపల్లి 17వ వార్డులోని 3వ అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పించారు. పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మిల్లెట్ జావా వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. బర్గర్లు, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్ పుల్లూరి కవిత, ఆశా వర్కర్ ఎం.సుజాత, చిన్నారులు, తల్లిదండ్రులు […]
జమ్మికుంట, సెప్టెంబర్ 28: మోత్కులగూడెంకు చెందిన బలభద్ర రామారావు అనారోగ్య సమస్యలతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న 9వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము వెంటనే స్పందించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.
జమ్మికుంట: షతరంజీ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ 75వ వార్షికోత్సవం, 86వ సాధారణ మహాసభలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభిప్రాయ భేదాలు సహజమని, అనంతరం అందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని అన్నారు. కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, అధికారుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గత నాలుగేళ్ల అభివృద్ధిని కొనసాగించి మరింత ముందుకు తీసుకెళ్తామని […]
UFBU ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చారు. నేటి నుంచి మూడు రోజుల పాటు బ్యాంక్ బ్రాంచ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభావితమయ్యే అవకాశం ఉండగా, ప్రైవేట్ బ్యాంకులపై ప్రభావం భిన్నంగా ఉండొచ్చు. ATM, UPI, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సాధారణంగా కొనసాగవచ్చని తాజా సమాచారం.
జమ్మికుంట, 26 సెప్టెంబర్ 2026: తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఇమ్రాన్ ఆరోపించారు. అసత్య పోస్టులతో తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి అండగా ఉండటం, పార్టీ నాయకులను కలవడాన్ని కొందరు వివాదాస్పదంగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రచారం కొనసాగితే చట్టపరంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.