జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ, కాటన్ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను చైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం, వైస్‌చైర్మన్ ఎర్రం సతీష్‌రెడ్డి, […]
కరీంనగర్ జిల్లా కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన బచ్చు భాస్కర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు చింతల శ్రీనివాస్, చందా రాజు, దిడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలో శేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెయిన్బో ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతికతతో ఎలక్ట్రానిక్స్ షోరూమ్ అందుబాటులోకి రావడం పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు సంతోషకరమన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు శ్రీలం శ్రీనివాస్, చందా రాజు, చింతల శ్రీనివాస్, దిడ్డి రాము, సీఐ రామకృష్ణ, సతీష్ రెడ్డి, గడ్డం దీక్షిత్, పోనగంటి మల్లయ్య, రాజు […]
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25, శుక్రవారం కొత్త పత్తి మార్కెట్‌కు 8 క్వింటాళ్ల అరైవల్స్ వచ్చాయి. ఒక వాహనం ద్వారా వచ్చిన పత్తికి క్వింటాల్‌కు రూ.7,551 ధర నమోదైంది. పత్తి బ్యాగుల అరైవల్స్ నిల్‌గా ఉన్నాయి. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో మార్కెట్‌కు సెలవు. సెప్టెంబర్ 28, సోమవారం మార్కెట్ తిరిగి ప్రారంభమవుతుంది.
24 సెప్టెంబర్, 2026: అక్టోబర్ 2026 నెలకు సంబంధించిన హోమం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబర్ 25న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉండనున్నందున భక్తులు నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET)–2026కు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌లో పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం తదితర వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయి హాల్‌టికెట్ పొందవచ్చు. Hall Tickets డౌన్లోడ్ చేసుకోవడానికి కింది వెబ్సైట్ సంప్రదించండి https://tgset.aptonline.in
జమ్మికుంట పట్టణ పరిధిలో నవరాత్రులు పూజలందుకున్న తొలి గణేష్ విగ్రహం నిమజ్జన కార్యక్రమం నాయిని చెరువు వద్ద ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నిమజ్జనాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు ప్రారంభమైనందున భక్తులు సకాలంలో చేరుకుని నిమజ్జనం పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, RDO, కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, MRO, CI, SI, అధికారులు పాల్గొన్నారు.
జమ్మికుంట: పట్టణంలో బుధవారం జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నాయిని చెరువు వద్ద పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం పలు ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్, పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్ చందా రాజు, ఏఈ వికాస్, […]
హైదరాబాద్: తెలంగాణలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బంజారాహిల్స్‌లో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల సంక్షేమ బోర్డుల విధి విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం గుంటి సామ్రాజ్యం, అన్నేడి వెంకట్ రెడ్డి, ఎస్.వి. శివకుమార్, కన్నెగంటి రవి, ఎస్.కే. సల్లావుద్దీన్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, […]
జమ్మికుంటలోని పాత ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు సందర్శించారు. భవనం చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ కళాశాలను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. విద్యార్థులకు సరైన హాస్టల్ వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నందున, భవనాన్ని వెంటనే హాస్టల్‌గా వినియోగించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో SFD కో-కన్వీనర్ గోస్కుల అజయ్, జమ్మికుంట నగర కార్యదర్శి భోగం శశాంక్ తదితరులు పాల్గొన్నారు.