News

Aug 13
దొడ్డె ఆంజనేయులు ఐఏఎస్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం

జమ్మికుంట, ఆగస్టు 13: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన ఐఏఎస్ దొడ్డె ఆంజనేయులు జన్మదిన సందర్భంగా వారి బందువులు జమ్మికుంట శివాలయం (బొమ్మలగుడి)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మికుంట ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దొడ్డ ఆంజనేయులు ఐఏఎస్ అక్క, బావ ఇల్లందుల శ్యామల–రమేష్ దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, ప్రజలకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా పలువురు భక్తులు, ప్రజలు పాల్గొని […]

Aug 11
పంచాయతీ కార్మికుల దీక్షలు ఆగస్టు 18, 19న.. జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు

జమ్మికుంట: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 18, 19 తేదీల్లో అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న దీక్షలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం చెల్పూర్ గ్రామపంచాయతీ వద్ద కార్మికులతో కలిసి దీక్షలకు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా కొప్పుల శంకర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో […]

Aug 11
జమ్మికుంట వరుణ్ మోటార్స్ లో కొత్త కారు ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

జమ్మికుంట (11 ఆగస్టు, 2026, జమ్మికుంట లోకల్ న్యూస్): పట్టణంలోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మారుతి సుజుకి షోరూమ్)లో నూతన బ్రెజ్జా కారును మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం పట్టణానికి వస్తుంటారని తెలిపారు. అలాంటి జమ్మికుంటలో జిల్లా స్థాయి పట్టణాలకు దీటుగా వివిధ షోరూమ్‌లు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం […]

Jul 23
తలకు తీవ్ర గాయాలైతే అత్య‌వ‌స‌ర చికిత్సే ప్రాణాలు కాపాడుతుంది – మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు

– ట్రామాకేర్‌పై కరీంనగర్ మెడికవర్ వైద్యుల అవగాహన సదస్సు జమ్మికుంట (జూలై 22): రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన బాధితులకు అత్య‌వ‌స‌ర చికిత్స అందించ‌డం ద్వారానే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వీలైనంత త్వ‌ర‌గా అన్ని సౌక‌ర్యాలున్న ఆసుప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. బుధ‌వారం జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఫంక్ష‌న్‌హాల్ లో అత్యవసర వైద్యం (ట్రామా కేర్) మరియు […]

Jul 23
తలకు తీవ్ర గాయాలైతే అత్య‌వ‌స‌ర చికిత్సే ప్రాణాలు కాపాడుతుంది…మెడికవర్ వైద్యులు

జమ్మికుంట (జూలై 22): రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన బాధితులకు అత్య‌వ‌స‌ర చికిత్స అందించ‌డం ద్వారానే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వీలైనంత త్వ‌ర‌గా అన్ని సౌక‌ర్యాలున్న ఆసుప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. బుధ‌వారం జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఫంక్ష‌న్‌హాల్ లో అత్యవసర వైద్యం (ట్రామా కేర్) మరియు న్యూరో కేర్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ […]

Jul 22
మున్సిపల్ వాటర్ సప్లయ్ సిబ్బందితో సమావేశమైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్

జమ్మికుంట (జూలై, 22):  మున్సిపల్ వాటర్ సప్లయ్ సిబ్బంది సమావేశమైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో 30 వార్డులలో ప్రస్తుత వర్షాకాలం దృశ్య నీటి సరఫరా విషయంలో అక్కడక్కడ పైపు లైన్ లీకేజ్ ఉన్నట్లయితే వాటిని వాటిని గుర్తించండి లేనిచో ప్రజలకు వర్షకాలంలో వర్షాల వల్ల ప్రజలకు కలుషిత నీరు వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక వాటిని గుర్తించి తగు చర్యలు తీసుకోగలరని తెలిపిన మున్సిపల్ చైర్మన్. ఈ […]

Jul 20
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జమ్మికుంట (20 జూలై 2026): స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఖాళీగా ఉన్న 4 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో తెలుగు-1, కామర్స్-1, డైరీ సైన్స్-1, క్రాప్ ప్రొడక్షన్-1 చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కమీషనర్ ప్రొసీడింగ్స్ నిబంధనల ప్రకారం.. […]

Jul 20
సప్తగిరి రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రాష్ట్ర డీజీపీ డి.ఎస్. చౌహాన్ ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సప్తగిరి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆర్‌వీఈఓ బస్వరెడ్డి, డీఎస్పీ సీతారెడ్డి, ఎమ్మార్వో దినేష్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అనిల్ ప్రశాంత్, డీఈ విజయశేఖర్, ఏసీ సురేష్, ఎస్సై రాజేష్, ఏఎస్ఐ ప్రవళికతో పాటు విజిలెన్స్, సివిల్ సప్లైస్ సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం, […]

Jul 15
స్థానికుల ఇబ్బందిని తీర్చి ఆదర్శంగా నిలిచిన యువ నాయకులు

జమ్మికుంట, జూలై 15, 2026: స్థానిక ఎంప్లాయీస్ కాలనీలో ఓ సమస్యకు తక్షణమే స్పందించిన యువ నాయకులు దౌలత్ పాషా, సందీప్ సామాజిక బాధ్యతను చాటుకుని స్థానికులకు ఆదర్శంగా నిలిచారు. వాట్సాప్ గ్రూప్ మెసేజ్‌తో తక్షణ స్పందనకాలనీలోని పది పోర్షన్ల వెనుక వీధి మధ్యలో రాత్రి 8 గంటల సమయంలో ఓ కుక్క మృతి చెందింది. దారి మధ్యలో కళేబరం పడి ఉండటంతో ఆ దారిన వెళ్లే ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. […]

Jul 01
ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడికి ఘన సన్మానం

జమ్మికుంట, జూలై 1: జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన లెంకలపల్లి శరత్ కుమార్‌కు స్థానిక గాండ్ల కుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. గాండ్ల కుల సంఘం తరపున నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శరత్ కుమార్‌ను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గాండ్ల కుల గౌరవ అధ్యక్షుడు వెన్నంపల్లి విఠల్ దాస్, మండల అధ్యక్షుడు పోతునూరి శ్రీశైలం పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షుడు […]

Listings News Offers Jobs Videos