జమ్మికుంట రూరల్ సెక్షన్ కార్యాలయంలో ఈ నెల 9న విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (CGRF–1, వరంగల్) ఆధ్వర్యంలో సమస్యల పరిష్కార సమావేశం నిర్వహించనున్నట్లు చైర్పర్సన్ కె. మాధవరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే సమావేశంలో జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాల వినియోగదారులు విద్యుత్ బిల్లులు, మీటర్లు, సరఫరా, కొత్త కనెక్షన్లు తదితర సమస్యలను నేరుగా ఫోరం దృష్టికి తీసుకురావచ్చన్నారు. సంబంధిత పత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.











Add a comment