జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి కొనుగోళ్లకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం మంగళవారం ముహూర్తం చేశారు. రైతులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. బహిరంగ వేలంలో పత్తికి గరిష్ఠంగా క్వింటాల్‌కు రూ.7,272, కనిష్ఠంగా రూ.7,011 ధర పలికింది. మురళీకృష్ణ, మల్లికార్జున ట్రేడర్స్ పత్తిని కొనుగోలు చేశారు. రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకువచ్చి మంచి ధరలు పొందాలని చైర్పర్సన్ సూచించారు.
జమ్మికుంట, 21 సెప్టెంబర్, 2026: మండల పరిషత్ సమావేశ మందిరంలో స్పెషల్ ఆఫీసర్ లింగారెడ్డి అధ్యక్షతన మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో 17 మంది సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ పద్మావతి, ఎంఆర్ఓ సుధాకర్ పాల్గొన్నారు. ఆయా శాఖల పనులపై సమీక్ష నిర్వహించగా, సర్పంచులు మందుల కొరత, వైద్య సిబ్బంది కొరత, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని లింగారెడ్డి […]
ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వర్కుటి మదన్ రావు అనారోగ్యంతో సెప్టెంబర్ 20న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందారు. ఆర్మీ, రైల్వే శాఖల్లో సేవలందించిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మదన్ రావు మృతికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోలుగూరి సదయ్య సంతాపం తెలిపారు. మదన్ రావు భౌతికదేహంపై కాంగ్రెస్ కండువా వేసి నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వీణవంక, సెప్టెంబర్ 20: వీణవంక మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. YuppTV, Turito ఫౌండర్ & CEO పాడి ఉదయ్ నందన్ రెడ్డి మండలంలోని 10 వినాయక మండపాలతో పాటు పలు గ్రామాల్లోని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండపాల నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో యువత చొరవను ఉదయ్ నందన్ రెడ్డి అభినందించారు.
జమ్మికుంట, సెప్టెంబర్ 20: ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ కౌన్సిల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మారపల్లి రాజేష్ నియమితులయ్యారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ఆర్టీఐపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని రాజేష్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన జాతీయ చైర్మన్ అఖిలేష్ రెడ్డి, తెలంగాణ అధ్యక్షులు బతుల శంకర్, రాష్ట్ర ఇంచార్జ్ కొంగంటి రాజ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానన్నారు. ఆయనకు సంస్థ ప్రతినిధులు అభినందనలు […]
జమ్మికుంట బస్టాండ్ సమీపంలో శ్రీ వరసిద్ధి వినాయక మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండలి ప్రతినిధులు గర్రెపల్లి అరుణాదేవి, గుండా కావ్య, గౌరిశెట్టి సుజాత, యాంసాని జ్యోతిరాణి, చందా గిరిజ, మద్ది వైష్ణవి, కే. శ్రీదేవి, ప్రణీత, రాజేశ్వరి, మహాలక్ష్మి, చొక్కారపు […]
జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు గర్రెపల్లి రాజమౌళి, సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సహకరించిన అసోసియేషన్‌కు కళాశాల సెక్రటరీ షేక్ అబ్దుల్లా, ప్రిన్సిపల్ అన్నబోయిన రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గండ్రపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను హుజూరాబాద్ అడిషనల్ జడ్జి వీణ పరిణతి, జమ్మికుంట ఎస్ఐ సంజీవ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రిన్సిపాల్ రేపాల ఇందిర, సర్పంచ్ తోట కవిత లక్ష్మణ్, ఉపసర్పంచ్ బీరేందర్ మాక్, ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలికారు. జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఎస్ఐ సంజీవ్ 112కు ఫోన్ చేయడం, […]
జమ్మికుంటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ABVP ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల నుంచి సువర్ణ ఫంక్షన్ హాల్ వరకు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సెమినార్లో మాట్లాడుతూ నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తికి సామాన్య ప్రజల పోరాటం, సర్దార్ పటేల్ నాయకత్వాన్ని వివరించారు. నిజాంను కీర్తించడం అమరుల త్యాగాలను కించపరచడమేనని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జమ్మికుంటలో గాండ్ల తిలకేశ్వర సంఘం ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పోతులూరి శ్రీశైలం ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమని, ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. గాండ్ల కులస్తులకు రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూప దీప నూనె […]