షతరంజీ సంఘం అభివృద్ధికి ఐక్యతతో పనిచేద్దాం

జమ్మికుంట: షతరంజీ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ 75వ వార్షికోత్సవం, 86వ సాధారణ మహాసభలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభిప్రాయ భేదాలు సహజమని, అనంతరం అందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని అన్నారు. కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, అధికారుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గత నాలుగేళ్ల అభివృద్ధిని కొనసాగించి మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos