జమ్మికుంట పట్టణ పరిధిలో పోగొట్టుకున్న ఐదు మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి రికవరీ చేశారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో CEIR ఆపరేటర్ కానిస్టేబుల్ సౌమ్య ఫోన్లను గుర్తించారు. సోమవారం వాటిని యజమానులు కొమ్ము ప్రేమ్ కుమార్, ఎండీ రియాజుద్దీన్, గాదె రాములు, ఎండీ సాదిక్, యాద వెంకటాచలంకు అప్పగించారు. ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మికుంట: కొత్తపల్లి 17వ వార్డులోని 3వ అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పించారు. పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మిల్లెట్ జావా వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. బర్గర్లు, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్ పుల్లూరి కవిత, ఆశా వర్కర్ ఎం.సుజాత, చిన్నారులు, తల్లిదండ్రులు […]
జమ్మికుంట, సెప్టెంబర్ 28: మోత్కులగూడెంకు చెందిన బలభద్ర రామారావు అనారోగ్య సమస్యలతో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న 9వ వార్డు కౌన్సిలర్ పొనగంటి రాము వెంటనే స్పందించి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను స్వయంగా భరించి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.
జమ్మికుంట: షతరంజీ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ 75వ వార్షికోత్సవం, 86వ సాధారణ మహాసభలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అభిప్రాయ భేదాలు సహజమని, అనంతరం అందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని అన్నారు. కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ, అధికారుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గత నాలుగేళ్ల అభివృద్ధిని కొనసాగించి మరింత ముందుకు తీసుకెళ్తామని […]