జమ్మికుంట: కొత్తపల్లి 17వ వార్డులోని 3వ అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి, పోషకాహారంపై అవగాహన కల్పించారు. పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మిల్లెట్ జావా వంటి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. బర్గర్లు, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ పద్మ, కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్, అంగన్వాడీ టీచర్ పుల్లూరి కవిత, ఆశా వర్కర్ ఎం.సుజాత, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.











Add a comment