వీణవంక కాంగ్రెస్‌కు బిగ్ షాక్: బీఆర్ఎస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి

వీణవంక: స్థానిక సంస్థల ఎన్నికల వేళ హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీణవంక మండలం కిష్ణంపేటకు చెందిన సీనియర్ నాయకుడు సిద్ధపల్లి మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని మహిపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండారి ముతయ్య తదితరులు పాల్గొన్నారు.

  • No comments yet.
  • Add a comment
    aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos