జమ్మికుంట: ప్రసిద్ధ వాగ్గేయకారుడు, లోక కవి అందెశ్రీ అంతిమయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కళాకారులు పాల్గొని నివాళులు అర్పించారు. అందెశ్రీ మరణం కళా, సాహిత్య రంగాలకు తీరని లోటు అని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిన అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, జనజాగృతి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కెర […]
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలను మంగళవారం జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దేశిని కోటి మాట్లాడుతూ, యువ నాయకుడైన దొంత రమేష్ ఎంతో మంది పేదలకు సహాయం చేశారని, రానున్న రోజుల్లో ఆయనకు మంచి ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ […]
స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత […]
నవంబర్ 05, 2025జమ్మికుంట: ధాన్యం బస్తాలతో వెళ్తున్న ట్రాక్టర్ ఫ్లైఓవర్‌పై అదుపుతప్పి బస్తాలు కింద పడిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తక్షణమే స్పందించి సిబ్బందిని పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సతీష్ స్వయంగా వడ్ల బస్తాలను మోసి ట్రాక్టర్‌పై ఎక్కించి రైతుకు సహాయం చేశారు. ఆపదలో ఆదుకున్న పోలీసుల సేవకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఖాజీపేట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు)కు సామాజిక సేవా రంగంలో తమిళనాడులోని ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. ఈ సందర్భంగా ‘నిత్య జనగణమన’ రూపకర్త, ఖాజిపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి ప్రభును శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా పింగళి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభాకర్ నిస్వార్థంగా దశాబ్ద కాలంగా సమాజ సేవ చేస్తున్నాడని, ఆయన ‘కైండ్ హార్టెడ్ పర్సన్’ అని అభివర్ణించారు. సీనియర్ జర్నలిస్టులు యం.డి […]
జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) అందుకున్నారు. శనివారం తమిళనాడులోని హోసూర్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి తమిళనాడు, కర్ణాటక యూనివర్సిటీ ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా డా. అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ డాక్టరేట్ తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. […]
అక్టోబర్ 25, 2025: జమ్మికుంట పట్టణంలో ఇటీవల మరణించిన ఖమ్మం పాటీ శ్రీనివాస్ కుటుంబానికి దీపావళి కాకర్స్ యూనియన్ అండగా నిలిచింది. యూనియన్ అధ్యక్షులు బోళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో, సభ్యులు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి శివకుమార్, తడిగొప్పుల శ్రీనివాస్, గడ్డం దీక్షిత్, చొక్కారపు అఖిలేష్, దొడ్డే రమేష్, గుల్లి రఘు, దేవునూరి వినయ్ పాల్గొన్నారు.
జమ్మికుంట: ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ అయిన ముక్కా జితేందర్ గుప్తా ఈరోజు (అక్టోబరు 25, 2025) తమ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, భక్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవతెలంగాణ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను సన్మానించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ వర్క్‌షాప్ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిజిఎం ప్రభాకర్, నవతెలంగాణ ఎడిటర్ రమేష్ చేతుల మీదుగా ఆయన సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు, మిత్రులు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మికుంట: పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా, అక్టోబరు 23, 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు.జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. టౌన్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్ సిబ్బంది అంతా ఈ ర్యాలీలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.