జమ్మికుంట (11 ఆగస్టు, 2026, జమ్మికుంట లోకల్ న్యూస్): పట్టణంలోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మారుతి సుజుకి షోరూమ్)లో నూతన బ్రెజ్జా కారును మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం పట్టణానికి వస్తుంటారని తెలిపారు. అలాంటి జమ్మికుంటలో జిల్లా స్థాయి పట్టణాలకు దీటుగా వివిధ షోరూమ్‌లు, వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం పట్టణ అభివృద్ధికి సంకేతమని అన్నారు.
కొత్తగా ఏర్పాటైన వరుణ్ మోటార్స్ వంటి సంస్థల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయని పేర్కొన్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాహనాల కొనుగోలు కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, జమ్మికుంటలోనే అన్ని సదుపాయాలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.

కొత్తగా ప్రారంభించిన అన్ని సదుపాయాలతో కూడిన బ్రెజ్జా కారును అవసరమైన వినియోగదారులు జమ్మికుంట వరుణ్ మోటార్స్‌లో కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫిరోజ్, కొలుగూరి సురేష్, మాచర్ల రాజు, యాట్ల అశోక్, ఎగిత అశోక్, షోరూమ్ మేనేజర్ అశోక్‌తో పాటు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.









Great