విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు: ఏఐఎస్ఎఫ్

జమ్మికుంట మండల కేంద్రంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కోశాధికారి లద్దునురి విష్ణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.
జమ్మికుంట బాలికల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, గురుకుల పాఠశాలలకు, శిథిలావస్థలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు. అనంతరం, ఏఐఎస్ఎఫ్ జమ్మికుంట మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండీ ఆజేం, కార్యదర్శిగా జే శశికుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మందారపు రత్నాకర్, కేశబోయిన రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos