Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
అక్టోబర్ 26, 2025జమ్మికుంట పట్టణ ప్రజలకు శుభవార్త. ప్రముఖ ఆన్‌లైన్ బైక్ ట్యాక్సీ సేవ ‘రాపిడో’ (Rapido) ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి, తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ సేవ ప్రారంభించబడింది. పట్టణంలో ఎక్కడికైనా త్వరగా చేరుకోవడానికి ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
అక్టోబర్ 25, 2025: జమ్మికుంట పట్టణంలో ఇటీవల మరణించిన ఖమ్మం పాటీ శ్రీనివాస్ కుటుంబానికి దీపావళి కాకర్స్ యూనియన్ అండగా నిలిచింది. యూనియన్ అధ్యక్షులు బోళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో, సభ్యులు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి శివకుమార్, తడిగొప్పుల శ్రీనివాస్, గడ్డం దీక్షిత్, చొక్కారపు అఖిలేష్, దొడ్డే రమేష్, గుల్లి రఘు, దేవునూరి వినయ్ పాల్గొన్నారు.
జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా రేపు (25-10-2025) శనివారం ఉదయం 7 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో సకాలంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరనీ అయ్యప్ప సేవా సమితి, జమ్మికుంట వారు ఒక ప్రకటనలో తెలిపారు.
జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవతెలంగాణ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను సన్మానించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ వర్క్‌షాప్ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిజిఎం ప్రభాకర్, నవతెలంగాణ ఎడిటర్ రమేష్ చేతుల మీదుగా ఆయన సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు, మిత్రులు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జమ్మికుంట: ఆదిత్య ఆసుపత్రి మహిళలకు శుభవార్త తెలిపింది. ఇకపై ప్రతి మంగళవారం ఆసుపత్రిలో ఉచిత ఓ.పి. (ఔట్ పేషెంట్) సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.ఈ సదావకాశాన్ని గర్భిణీ మహిళలు మరియు సాధారణ మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చని ఆదిత్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.మంగళవారం రోజున ఆసుపత్రికి వచ్చే మహిళలు ఎటువంటి ఫీజు లేకుండా వైద్యుల సలహాలు, సూచనలు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు […]
జమ్మికుంట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. ఈ బంద్‌కు […]
అక్టోబర్ 18, 2025జమ్మికుంట: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి జమ్మికుంటలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ డా. గీతాంజలి నరేష్ ప్రతి ఆదివారం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జమ్మికుంట నందు రోగులకు అందుబాటులో ఉంటున్నారు.కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం ఇకపై కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాలకు వెళ్లవలసిన అవసరం లేదని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. జమ్మికుంటలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని […]
2025 అక్టోబర్ 18కరీంనగర్ జిల్లా, జమ్మికుంట: లెదర్ పార్కులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకురావాలని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డి) జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.జమ్మికుంట గాంధీ చౌరస్తాలో లెదర్ పార్క్ సాధన చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. సుమారు 11 సంవత్సరాల క్రితం చర్మకారుల అభివృద్ధి కోసం ఉమ్మడి […]
జమ్మికుంట, అక్టోబర్ 18 (జమ్మికుంటలోకల్.కామ్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, బీసీలను మోసం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం సిగ్గుచేటని అన్నారు.42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కులగూడెం చౌరస్తా నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ […]
17 అక్టోబర్ 2025బీసీల ఉద్యమాలన్నింటికీ బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది: సింగిల్ విండో చైర్మన్కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్, మాజీ ఎంపీటీసీ తోట లక్ష్మణ్ మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా జరుగుతున్న కుట్రలకు నిరసనగా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు (18) జరగబోయే తెలంగాణ బంద్‌ను పాటించాలని వారు […]