జమ్మికుంట పాఠశాల ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

జమ్మికుంట: మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవంబర్ 10, సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన 26 మంది విద్యార్థులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎమ్మార్వో, స్థానిక ఎంఈఓలతో కలిసి విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన లోపాలను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, లోపాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందిని, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రం సతీష్ రెడ్డి, దేశిని కోటి, పొనగంటి మల్లయ్య, పూదరి రేణుక, పవన్, బొంగోని వీరన్న గౌడ్, పిట్టల రమేష్, శ్రీహరి, దొడ్డే నవీన్, సందీప్, ప్రణయ్, ప్రవీణ్, సురేష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos