Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.
నవంబర్ 05, 2025జమ్మికుంట: కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) ఆలయం భక్త సంద్రమైంది. భక్తులు స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ఉసిరి చెట్టుకు దీపాలు సమర్పించారు. అమ్మవారికి పౌర్ణమి పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా, అన్నపూర్ణ సేవా సమితి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.
జమ్మికుంట: స్వామి వివేకానంద పాఠశాల హాస్టల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని అధికారులను కోరినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై BRSV రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల యజమాన్యం కనీసం స్పందించకపోవడం, అధికార యంత్రాంగం మద్దతుగా నిలవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలు ధన దాహంతో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని విస్మరిస్తున్నాయని […]
జమ్మికుంట: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది నుతాల శ్రీనివాస్‌ను బీజేపీ నాయకులు జమ్మికుంటలోని ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడారు. న్యాయ వృత్తిలో పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మంచి పేరు శ్రీనివాస్‌కు ఉందని కొనియాడారు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో పనిచేసి, బీజేపీ పటిష్టతకు కూడా […]
జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పుట్టినరోజు వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం పాషా ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు భారీగా బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం, జమ్మికుంట శివాలయంలో మహా అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ […]
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ వెంకట రమణ శనివారం సాయంత్రం జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (ప్రభుత్వ ఆసుపత్రిని) ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను మెరుగుపరిచేందుకు ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.తనిఖీలో భాగంగా, డాక్టర్ వెంకట రమణ లేబర్ రూమ్, వార్డులు, సోనోగ్రఫీ రూమ్, మరియు ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆదేశాలు: * ప్రతి గర్భిణీకి మెరుగైన వైద్యం అందించాలి. * ఆసుపత్రిలోనే […]
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా): రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (STUTS) జమ్మికుంట మండల శాఖకు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా మేడుదుల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ రజాక్ పాషా ఎన్నికయ్యారు.ఈరోజు (తేదీ: అక్టోబరు 31, 2025) ఎంపీయూపీఎస్ ధర్మారం పాఠశాల ఆవరణలో మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారి రవీంద్ర నాయక్ మరియు సీనియర్ నాయకులు జి. భాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మండల నూతన శాఖ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. […]
జమ్మికుంట: స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా ఈరోజు హోమం మరియు స్వామివారికి విశేషాలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ శ్రీధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప సేవ సమితి ఆకాంక్షించింది.
జమ్మికుంట (అక్టోబర్ 28, 2025): జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు జరిగే మంత్రశిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళవారం ఆవిష్కరించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి పీఠాధిపతులు రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ […]
జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: ఆల్ ఇండియా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (AISJAC) వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర సంజయ్ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ పేద విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని కొనియాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల అన్యాయాలను అరికట్టడానికి, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు లేకుండా ప్రతి […]
జమ్మికుంట: గౌతమి స్కూల్ 1996-97 ఎస్.ఎస్.సి. బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులైన రాజిరెడ్డి, కరుణాకరరెడ్డి, విజయభాస్కర్, రమణారెడ్డి, అశోక్, చంద్ర మోహన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, అశోక్, రవి, సురేష్, సతీశ్, శ్రీనివాస్, సలీం తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.