Tag: jammikunta

Jammikunta News, Events, Jobs and Classifieds. Jammikunta located in Karimnagar District of Telangana state. Singing Daily National Anthem in various centers of the Town is started from Jammikunta.

Oct 29
జమ్మికుంట అయ్యప్ప దేవాలయంలో వైభవంగా హోమం!

జమ్మికుంట: స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా ఈరోజు హోమం మరియు స్వామివారికి విశేషాలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న భక్తులందరికీ శ్రీధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అయ్యప్ప సేవ సమితి ఆకాంక్షించింది.

Oct 28
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట: కరపత్రం ఆవిష్కరణ!

జమ్మికుంట (అక్టోబర్ 28, 2025): జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు జరిగే మంత్రశిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళవారం ఆవిష్కరించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి పీఠాధిపతులు రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ […]

Oct 27
ఘనంగా ‘విద్యార్థుల ప్రశ్నించే గొంతుక’ సంజయ్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: ఆల్ ఇండియా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (AISJAC) వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర సంజయ్ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ పేద విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని కొనియాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల అన్యాయాలను అరికట్టడానికి, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు లేకుండా ప్రతి […]

Oct 26
గౌతమి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జమ్మికుంట: గౌతమి స్కూల్ 1996-97 ఎస్.ఎస్.సి. బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులైన రాజిరెడ్డి, కరుణాకరరెడ్డి, విజయభాస్కర్, రమణారెడ్డి, అశోక్, చంద్ర మోహన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, అశోక్, రవి, సురేష్, సతీశ్, శ్రీనివాస్, సలీం తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Oct 26
జమ్మికుంటలో రాపిడో బైక్, ట్యాక్సీ సేవలు ప్రారంభం

అక్టోబర్ 26, 2025జమ్మికుంట పట్టణ ప్రజలకు శుభవార్త. ప్రముఖ ఆన్‌లైన్ బైక్ ట్యాక్సీ సేవ ‘రాపిడో’ (Rapido) ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి, తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ సేవ ప్రారంభించబడింది. పట్టణంలో ఎక్కడికైనా త్వరగా చేరుకోవడానికి ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.

Oct 25
జమ్మికుంట: మృతుని కుటుంబానికి కాకర్స్ యూనియన్ ఆర్థిక సహాయం

అక్టోబర్ 25, 2025: జమ్మికుంట పట్టణంలో ఇటీవల మరణించిన ఖమ్మం పాటీ శ్రీనివాస్ కుటుంబానికి దీపావళి కాకర్స్ యూనియన్ అండగా నిలిచింది. యూనియన్ అధ్యక్షులు బోళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో, సభ్యులు మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి శివకుమార్, తడిగొప్పుల శ్రీనివాస్, గడ్డం దీక్షిత్, చొక్కారపు అఖిలేష్, దొడ్డే రమేష్, గుల్లి రఘు, దేవునూరి వినయ్ పాల్గొన్నారు.

Oct 24
జమ్మికుంట అయ్యప్ప దేవాలయంలో 25న లక్ష్మీ గణపతి హోమం

జమ్మికుంటలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య లక్ష్మీ గణపతి హోమంలో భాగంగా రేపు (25-10-2025) శనివారం ఉదయం 7 గంటలకు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి విశేష అలంకరణ కార్యక్రమం జరగనుంది. భక్తులు సాంప్రదాయ వస్త్రాలలో సకాలంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరనీ అయ్యప్ప సేవా సమితి, జమ్మికుంట వారు ఒక ప్రకటనలో తెలిపారు.

Oct 24
సీనియర్ జర్నలిస్ట్ ఏబూసి శ్రీనివాస్‌కు సన్మానం

జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, నవతెలంగాణ రిపోర్టర్ ఏబూసి శ్రీనివాస్ ను సన్మానించారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన నవతెలంగాణ వర్క్‌షాప్ సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిజిఎం ప్రభాకర్, నవతెలంగాణ ఎడిటర్ రమేష్ చేతుల మీదుగా ఆయన సేవలను గుర్తించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి జర్నలిస్టులు, మిత్రులు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Oct 20
మంగళవారం ఉచిత ఓ.పి. సేవలు – ఆదిత్య ఆసుపత్రి, జమ్మికుంటలో గర్భిణీ, సాధారణ మహిళల కోసం ప్రత్యేక అవకాశం

జమ్మికుంట: ఆదిత్య ఆసుపత్రి మహిళలకు శుభవార్త తెలిపింది. ఇకపై ప్రతి మంగళవారం ఆసుపత్రిలో ఉచిత ఓ.పి. (ఔట్‌ పేషెంట్) సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.ఈ సదావకాశాన్ని గర్భిణీ మహిళలు మరియు సాధారణ మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చని ఆదిత్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.మంగళవారం రోజున ఆసుపత్రికి వచ్చే మహిళలు ఎటువంటి ఫీజు లేకుండా వైద్యుల సలహాలు, సూచనలు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు […]

Oct 19
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆగదు: బీసీ నాయకులు

జమ్మికుంట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు పోరాటం ఆగదని బీసీ ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏ బూసి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన జమ్మికుంట బంద్ స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. ఈ బంద్‌కు […]

Listings News Offers Jobs Contact