జమ్మికుంట STUTS నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక: అధ్యక్షుడిగా మేడుదుల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా రజాక్ పాషా!

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా): రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (STUTS) జమ్మికుంట మండల శాఖకు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా మేడుదుల నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ రజాక్ పాషా ఎన్నికయ్యారు.
ఈరోజు (తేదీ: అక్టోబరు 31, 2025) ఎంపీయూపీఎస్ ధర్మారం పాఠశాల ఆవరణలో మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల అధికారి రవీంద్ర నాయక్ మరియు సీనియర్ నాయకులు జి. భాస్కర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మండల నూతన శాఖ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో కీలక పదవులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం వివరాలు:

image editor output image 1701325914 17619364093482710940370789295286


ఉపాధ్యాయులకు సేవలు అందిస్తాం:
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన మేడుదుల నాగరాజు మరియు రజాక్ పాషా మాట్లాడారు. జమ్మికుంట మండలంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి నూతన కార్యవర్గం తరపున నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నూతన కార్యవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
aditya hospital banner

Also read:

0
Would love your thoughts, please comment.x
()
x
Listings News Offers Jobs Videos