గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

తేదీ 17-09-2017

గిరిజనులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

జమ్మికుంట టౌన్: నిన్న జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా, తాడ్వాయి మండలం, లవ్వాలా గ్రామ సమీపంలో నివసిస్తున్న 200 మంది దళిత గిరిజన కుటుంబాలపై అమానుషంగా దాడి చేసి చెట్టుకు కట్టేసి మహిళలను సైతం చూడకుండా చిత్రహింసలు చేశారని, ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీనికీ బాధ్యత వహిస్తూ అటవీ శాఖా మంత్రిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయరామారావు, గౌస్ పాషా, బుర్ర కుమార్ గౌడ్, చాంద్ పాషా , బొల్లి వెంకటేష్, నాగేందర్, రవీ, శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact