జమ్మికుంట, అక్టోబర్ 27, 2025: ఆల్ ఇండియా స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (AISJAC) వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర సంజయ్ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ పేద విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో ముందుంటారని కొనియాడారు. కార్పొరేట్ విద్యా సంస్థల అన్యాయాలను అరికట్టడానికి, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు లేకుండా ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా ప్రశ్నించే గొంతుకగా సంజయ్ నిలిచారని ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఆయన ఉన్నత పదవులు అధిరోహించి విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆడపు సాయి, ప్రధాన కార్యదర్శి పంజాల హర్షత్, కిరణ్, మహేష్, మౌనిక, శిరీష తదితరులు పాల్గొన్నారు.







