మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) సామాజిక సేవకు గుర్తింపుగా ఇటీవల తమిళనాడులోని హోసూర్ నగరంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అదేవిధంగా, ఆయన కూతురు అంబాల అక్షిత 2024-25 విద్యా సంవత్సరంలో నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీటు సాధించారు.
ఈ సందర్భంగా, మడిపల్లి నర్తన డప్పు కళా బృందం కళాకారులు మంగళవారం జమ్మికుంట న్యూ జర్నలిస్ట్ కాలనీలోని వారి నివాసంలో తండ్రి, కూతుళ్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు సమాజ సేవతో పాటు చిత్రకారునిగా, అంతర్జాతీయ క్రీడాకారునిగా, డప్పు కళాకారునిగా అన్ని రంగాలలో రాణిస్తూ తమ ప్రాంతానికి పేరు తెచ్చారని కళాకారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జె. సతీష్, అంబాల శ్రీరామ్, గంగారపు తిరుపతి, అంబాల రామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.







