పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట: కరపత్రం ఆవిష్కరణ!

జమ్మికుంట (అక్టోబర్ 28, 2025): జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నవంబర్ 8 నుండి 10వ తేదీ వరకు జరిగే మంత్రశిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కరపత్రాన్ని విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళవారం ఆవిష్కరించారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి పీఠాధిపతులు రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల భాస్కరాచారి, కై రోజు రాజమౌళి సహా పలువురు పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact