కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పుట్టినరోజు వేడుకలు

జమ్మికుంట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పుట్టినరోజు వేడుకలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం పాషా ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

పట్టణ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు భారీగా బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం, జమ్మికుంట శివాలయంలో మహా అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ పుట్టినరోజు వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వొల్లాల శ్రీనివాస్, డాన్ రమేష్, కృష్ణ మోహన్, సలీం, పోతుల శ్రీనివాస్, గడ్డం రమేష్, కోరేసదానందం, నరికే సుమన్, రమేష్, వంశీ రెడ్డి, చింటూ రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact