జమ్మికుంట: మైనారిటీ వెల్ఫేర్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జమ్మికుంట( ఇందిరానగర్)కు చెందిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 1 పాఠశాలలో మంగళవారం రోజున మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జన్మదినం రోజును పురస్కరించుకొని నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషనల్ డే ను ఘనంగా ప్రిన్సిపల్ నాధియా ఫర్నాజ్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య కళలతో ఆటపాటలతో పలువురిని ఆలకించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో జిల్లా మరియు రాష్ట్రంలో పథకాలు సాధించిన విద్యార్థులకు విద్యలో మండల టాపర్లకు జిల్లా టాపర్లకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మైనారిటీ నాయకులు, జమ్మికుంట ఖురేషి మజీద్ అధ్యక్షులు ఎండి జాకీర్, ముఫ్తి మాసూం సహాబ్, ఎండి చాంద్, జయభారతి స్కూల్ కరస్పాండెంట్ ప్రతాప్ రెడ్డి,లతోపాటు ఉపాధ్యాయురాల్లు విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







