నవంబర్ 17న వైభవంగా కార్తీక దీపోత్సవం
జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నవంబర్ 17, 2025 సోమవారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శివరామకృష్ణ ఆశ్రమ బృందం, అంజలి డ్యాన్స్ అకాడమీ, శ్రీకృష్ణ అకాడమీచే కూచిపూడి నాట్యం, చక్కభజనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. హిందూ ధర్మ ప్రచారకులు స్వామి లక్షణాచార్య ప్రవచనం, పురోహితులచే శివునికి అభిషేకం ఉంటాయి. లక్ష దీపోత్సవంలో పాల్గొని జమ్మికుంట భక్తులు, ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందాలని ఉత్సవ కమిటీ కోరుతోంది.







