నవంబర్ 05, 2025
జమ్మికుంట: కార్తీక పౌర్ణమి సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి (బొమ్మల గుడి) ఆలయం భక్త సంద్రమైంది. భక్తులు స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు, ఉసిరి చెట్టుకు దీపాలు సమర్పించారు. అమ్మవారికి పౌర్ణమి పూజలు, లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ తీర్థ ప్రసాదాలు అందించగా, అన్నపూర్ణ సేవా సమితి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.







